Illuru Members (468)

Health

Human
Soil
Animals

congress


Posted bhaskar On 25 Mar, 2019 03:23 PM at Illuru,Khammam

ఎన్నికల్లో పరువు నిలబెట్టుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ చెమటోడ్చక తప్పట్లేదు. అసెంబ్లీ ఫలితాల ప్రకారం ఖమ్మం, మానుకోటలో కాంగ్రెస్‌కు మెజారిటీ ఉన్నా.. పిరాయింపులతో సీన్ మారిపోయింది. ఖమ్మం నుంచి నలుగురు కూటమి ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరడంతో పరిస్థితి తలకిందులైంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల పరిధిలో టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పైచేయి సాధించింది. తద్వారా కాంగ్రెస్ బలంగా ఉన్న స్థానాల్లో కూడా టీఆర్ఎస్ ఆ పార్టీని బలహీనం చేసింది. ఫలితంగా లోక్‌సభ ఎన్నికల్లో పరువు నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో చెమటోడ్చక తప్పని పరిస్థితి. అయినా ఖమ్మం, మహబూబాబాద్ సహా లోక్‌సభ ఎన్నికల్లో 8 - 10 సీట్లు గెలుచుకోవాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయ స్థాయి అంశాలతోపాటు మైనారిటీ ఓట్లు తమకు కలిసొచ్చే అవకాశముందని అంచనా వేస్తోంది. ఎమ్మెల్యేలు పోయినా.. ఓట్లు వేసిన క్యాడర్ కాంగ్రెస్ వెంటే ఉన్నారని.. వారిని పోలింగ్ బూత్ వరకూ వచ్చేలా చేసుకుంటే విజయం తమదేననే ధీమాను కాంగ్రెస్ వ్యక్తం చేస్తోంది.







Our scientific research is intended to improve the soil, maintain eco balance and protect consumer health by which try to achieve leadership in organic market. Chairman's Voice Our goal is to achieve pollution free soil, stress free plant, wealthy farmer and healthy society...





Show more