Illuru Members (468)

Health

Human
Soil
Animals

Divya spandana


Posted bhaskar On 03 Oct, 2018 04:32 PM at Illuru,Khammam

కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం చీఫ్ పదవికి దివ్య స్పందన (రమ్య) రాజీనామా చేసినట్టు తెలిసింది. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని, పార్టీలో వేరే పదవి ఆమెకు కేటాయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ పరిణామాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను అభ్యంతరకరమైన రీతిలో ట్వీట్‌ చేసినందుకు దివ్య స్పందనపై 'దేశద్రోహం' కేసు నమోదైంది. వివాదాస్పద రఫేల్ ఒప్పందంపై వచ్చిన ఆరోపణలకు మోదీ స్పందించడం లేదని ఓ ట్వీట్‌లో ఆమె ప్రశ్నించడంతో పాటు మోదీని 'దొంగ'గా అభివర్ణించారు. ఓ ఫోటోను కూడా ట్వీట్‌కు జోడించారు. దీంతో లక్నోకి చెందిన లాయర్ సైయద్ రిజ్వార్ అహ్మద్ ఆమెపై ఫిర్యాదు చేశారు. దివ్యస్పందన ట్వీట్ పరువుదిగజార్చేలా ఉందని, దేశ సార్వభౌమాధికారం, రిపబ్లిక్‌కు ప్రధాని ప్రతినిధి అని, ఆమె స్పందన దేశ ప్రతిష్టను దిగజార్చడమే గాకుండా, దేశ ధిక్కారం కిందకు వస్తుందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


Our scientific research is intended to improve the soil, maintain eco balance and protect consumer health by which try to achieve leadership in organic market. Chairman's Voice Our goal is to achieve pollution free soil, stress free plant, wealthy farmer and healthy society...










Show more