Illuru Members (468)

Health

Human
Soil
Animals

Amit Shah and Telangana elections


Posted bhaskar On 05 Sep, 2018 12:57 PM at Illuru,Khammam

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తే స్వయంగా తానే రంగంలోకి దిగుతానని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా పార్టీ రాష్ట్ర నేతలకు భరోసా ఇచ్చారు. డిసెంబరులో ఎన్నికలు జరగబోతున్న రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాలకు బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారని, అక్కడి ప్రచార బాధ్యతను వాళ్లే చూసుకుంటారని అన్నారు. ఏ మాత్రం కేడర్‌ లేని త్రిపురలోనే పకడ్బందీ వ్యూహంతో విజయం సాధించామని, అలాంటప్పుడు బలమైన కేడర్‌ ఉన్న తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. టీఆర్‌ఎ్‌సపై సీరియస్‌ ఫైట్‌ చేయబోతున్నామని, యుద్ధం మొదలైనట్లేనని, పార్టీ నాయకులు తమ వంతు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 12 లేదా 15వ తేదీన మహబూబ్‌నగర్‌ నుంచి ఎన్నికల శంఖాన్ని పూరిస్తానని చెప్పారు. వచ్చే మూడు నెలల్లో పది రోజులకు ఒకసారి ప్రచారానికి వస్తానన్నారు. తెలంగాణ ఎన్నికల బాధ్యతను తానే స్వయంగా చేపడుతున్నట్లు ప్రకటించారు. ఆదివారం అర్ధరాత్రి శంషాబాద్‌ విమానాశ్రయంలో రాష్ట్ర పార్టీ ముఖ్యులతో భేటీ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను సమీక్షించారు. ఎన్నికల వ్యూహానికి ఆమోద ముద్ర వేశారు ‘‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ఆ ఓటుబ్యాంకు మనవైపు రావాలి. పన్నా ప్రముఖ్‌ వ్యవస్థను మరింత పక్కాగా పర్యవేక్షిస్తా. జాతీయ నాయకత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం లేదు. గెలుపే లక్ష్యం’’ అన్నారు. తెలంగాణలో పార్టీ ఉనికికి భంగం కలిగించే నిర్ణయాలేవీ బీజేపీ తీసుకోబోదని స్పష్టం చేశారు. ‘‘తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగితే ఇక్కడే మకాం వేస్తా. ఈ నెల్లోనే 3-4 సభలకు ఏర్పాట్లు చేయండి. నేనూ వస్తా’’ అంటూ దిశానిర్దేశం చేశారు. ఇతర పార్టీల నుంచి కీలక నేతలు వస్తే తీసుకుందామని అమిత్‌ షా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కర్ణాటకకు చెందిన జాతీయ సంఘటన్‌ ప్రధాన కార్యదర్శి వీఏ సంతోష్‌కు తెలంగాణలో ఎన్నికల బాధ్యత అప్పగించారు. ఈ భేటీలోనే సంతోష్‌ను పరిచయం చేసిన అమిత్‌ షా ఎన్నికలు పూర్తయ్యేవరకు సంతోష్‌ బృందం ఇక్కడే మకాం వేస్తుందని చెప్పినట్లు తెలిసింది. మొత్తం 119 నియోజక వర్గాల్లో పోటీ చేయబోతున్నామని, మూడు నెలల్లో అన్ని నియోజకవర్గాల్లో సభలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి సభకు ఒక జాతీయ నాయకుడు హాజరయ్యేట్లు చూస్తానన్నారు. ప్రగతి నివేదన సభ ఎలా జరిగింది? స్పందన ఎలా ఉంది? అంటూ అమిత్‌షా పార్టీ ముఖ్యుల నుంచి ఆరా తీశారు. అనుకున్న విధంగా జన సమీకరణ ఎందుకు చేయలేకపోయారు? ఎంత ఖర్చు చేశారు? వంటి వివరాలను అడిగారు. 50 నియోజకవర్గాల్లో బీజేపీ బలం, బలహీనతలపై రాష్ట్ర నేతలు ఆయనకు సమగ్ర నివేదిక అందజేశారు.







Our scientific research is intended to improve the soil, maintain eco balance and protect consumer health by which try to achieve leadership in organic market. Chairman's Voice Our goal is to achieve pollution free soil, stress free plant, wealthy farmer and healthy society...





Show more