Illuru Members (468)

Health

Human
Soil
Animals

kannababu amd ycp


Posted bhaskar On 20 Aug, 2018 09:46 AM at Illuru,Khammam

వైసీపీ అధినేత జగన్‌ విశాఖ జిల్లాలో పర్యటిస్తుండగానే... అదే జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో అంతర్గత విభేదాలు ‘సోషల్‌ మీడియా’ వేదికగా రచ్చకెక్కాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఎలమంచిలి నేతలు, కార్యకర్తలతో మునగపాకలో సమావేశం నిర్వహించారు. తొలుత నియోజకవర్గం మాజీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజుపై పలు ఆరోపణలు, విమర్శలు చేశారు. తర్వాత మైకు తీసుకున్న కన్నబాబురాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘గత ఎన్నికల్లో జిల్లాలో ఎవరూ ఇవ్వనంత డొనేషన్‌ను జగన్‌కు ఇచ్చాను. ఇక్కడ ఎవరు ఎటువంటివారో నాకు తెలుసు. ఎవ్వరి మాటా లెక్కచేయను. ఎవరెన్ని చెప్పినా నా స్టైల్‌ మారదు. ఎన్నికల్లో ఎలా గెలవాలో నాకు బాగా తెలుసు’’ అని అన్నారు. దీంతో ఇరువర్గాల కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేశారు.


Our scientific research is intended to improve the soil, maintain eco balance and protect consumer health by which try to achieve leadership in organic market. Chairman's Voice Our goal is to achieve pollution free soil, stress free plant, wealthy farmer and healthy society...










Show more