Illuru Members (468)

Health

Human
Soil
Animals

unlimited


Posted bhaskar On 02 Jul, 2018 08:24 AM at Illuru,Khammam

ఏదైనా రెస్టారెంట్ లేదా హోటల్ యజమాని నిత్యం తమ వ్యాపారం వినియోగదారులతో కళకళలాడిపోవాలని భావిస్తారు. అయితే ఆహారప్రియుల తాకిడి అధికం కావడంతో ఒక రెస్టారెంట్‌ను మూసివేసిన ఉదంతం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే చైనాకు చెందిన ఒక వ్యక్తి జియామెర్నర్ పేరిట ఒక రెస్టారెంట్ ప్రారంభించాడు. అయితే అది రెండువారాల్లో‌నే మూసివేయాల్సి వచ్చింది. దీనికి గల కారణం తెలుసుకుంటే ఎవరైనా విస్తుపోవాల్సిందే! రెస్టారెంట్ యజమాని వినియోగదారుల కోసం ఒక ప్రత్యేక ఆఫర్ ప్రకటించాడు. దీనిప్రకారం రూ. 1300కు అన్‌లిమిటెడ్‌గా ఆహారం తినేందుకు అవకాశం కల్పించాడు. ఈ ఆఫర్ గురించి తెలియగానే ఆహార ప్రియులు రెస్టారెంట్ ముందు క్యూకట్టారు. దీంతో రెస్టారెంట్ యజమాని సంబరపడిపోయాడు. అయితే వచ్చినవారంతా అక్కడ ఆహారం తినడంతో పాటు, పార్సిల్స్ కూడా తీసుకు వెళ్లడం మొదలుపెట్టారు. ఈ వ్యవహారం మరింతగా పెరిగిపోవడంతో రెస్టారెంట్ యజమాని చేసేదిలేక దుకాణం మూసేయాల్సి వచ్చింది. అందుకే ఇలాంటి ఆఫర్లు ప్రకటించే ముందు రెస్టారెంట్ యజమానులు ఒకసారి ఆలోచించుకోవాలని పలువురు సూచిస్తున్నారు.


Our scientific research is intended to improve the soil, maintain eco balance and protect consumer health by which try to achieve leadership in organic market. Chairman's Voice Our goal is to achieve pollution free soil, stress free plant, wealthy farmer and healthy society...










Show more